అన్నయ్యను కోల్పోయిన నాగార్జున
నందమూరి హరికృష్ణ మృతిపై అక్కినేని నాగార్జున తీవ్ర దిగ్భాంత్రికి గురయ్యారు. ఆయనతో కలిసి నటించిన రోజులను గుర్తు చేసుకున్నారు. సీతారామరాజులో అన్నదమ్ములుగా కలిసినటించిన వీరు ఆ బంధాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. అన్నా అని పిలిచే నాగార్జున హరికృష్ణ లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. చాలారోజులు అయింది నిన్ను చూసి, కలవాలి తమ్ముడు అంటూ ఆయన వారం రోజుల క్రితం ఫోన్ లో మాట్లాడిన మాటలను గుర్తు చేశారు నాగార్జున. ట్విట్టర్ ద్వారా ఈ విషయాలను పంచుకున్నారు.