వైరల్ : క్రిష్ స్థానంలో కంగనా

క్రిష్ దర్శకత్వంలో కంగన ప్రధాన పాత్రలో ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఐతే, క్రిష్‌కు, కంగనకు మధ్య మనస్పర్ధలు వచ్చాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటికే చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. తనకు క్రిష్‌తో ఎలాంటి విభేదాలూ లేవని, తామిద్దరం రోజూ స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూనే ఉంటామని కంగన తెలిపారు.

తాజాగా సెట్‌లోని క్లాప్‌బోర్డ్‌ ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఎందుకంటే ఆ క్లాప్‌బోర్డ్‌లో ‘డైరెక్టర్’ స్థానంలో క్రిష్‌ పేరు కాకుండా కంగన పేరుంది. కిశోర్‌ అనే నెటిజన్‌ ఆ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘అయ్యో అదేంటి? క్రిష్‌ స్థానంలో కంగన పేరుందేంటి?’ అని ప్రశ్నించాడు. దీనిపై చిత్రబృందం వెంటనే క్లారిటీ ఇచ్చి.. గందరగోళానికి తెరదించే ప్రయత్నం చేసింది. ‘మణికర్ణిక’ సినిమాకు దర్శకుడు క్రిష్ నే. సినిమాలోని కొన్ని ప్యాచ్‌ వర్క్స్‌ మిగిలిపోయాయి. సెట్లో ఎలాంటి కన్‌ఫ్యూజన్‌ లేకుండా ఉండేందుకు క్లాప్‌ బోర్డ్‌పై దర్శకుడి పేరును క్రిష్‌కు బదులు కంగన అని రాశాం’ అని వెల్లడించారు