అంత ధీమా ఉంటే ‘ప్రగతి నివేదన’ అవసరం ఏంటి..?
టిఆర్ఎస్ వందసీట్లు గెలిచే విశ్వాసం ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేసి సభ ఎందుకు నిర్వహిస్తున్నారని కాంగ్రస్ నేత డీకే అరుణ విమర్శించారు. టీఆర్ఎస్ కు ఆత్మవిశ్వాసం లేదు, ప్రజల్లో విశ్వాసం లేదని, హామీలపై ప్రజలు ప్రశ్నించకముందే ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారని ఆమె అన్నారు. సభకు 300కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఏం ప్రగతి సాధించారని ఇన్నికోట్లు పెట్టి సభ నిర్వహిస్తున్నారని ఆమె ప్రశ్నించారు.
అప్పుల రాష్ట్రంగా మార్చడమే మీ ప్రగతా అంటూ దుయ్యబట్టారు డీకే అరుణ. ఓటమి భయంతోనే ప్రగతినివేదన సభ నిర్వహిస్తున్నారని, 100సీట్లు గెలిచే ధీమా ఉంటే ప్రగతి నివేదన ఇవ్వాల్సిన అవసరం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన టిఆర్ఎస్ ఓటమి ఖాయమని, కేసీఆర్ ను కుర్చీ దించడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారామె.