చిరు కోసం టబు

మెగాస్టార్ చిరంజీవి 151 చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. సురేందర్ రెడ్డి దర్శకుడు. చిరుకి జంటగా నయనతార జతకట్టనుంది. బిగ్ బీ అమితాబ్, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్, జగపతిబాబు, తమన్నా.. తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

మెగాస్టార్ పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా విడుదలైన ‘సైరా’ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడీ సినిమా గురించి మరో ఆసక్తికరమైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు నటిస్తుందని టాక్. ఆమె త్వరలోనే షూటింగ్ లో జాయిన్ కానుంది.

మరోవైపు, సైరా చిత్రబృందం జార్జియా వెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 50 మంది చిత్ర బృందం జార్జియా పయనమవుతున్నట్టు సమాచారం. కొన్ని కీలకమైన యుద్ధ సన్నివేశాలన్నీ అక్కడే చిత్రీకరణ జరుపుకోనున్నారు. ఈ సినిమాని వచ్చే యేడాది వేసవిలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.