బిగ్ బాస్’పై బోలేడు నిందలు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 దగ్గర పడుతోంది. వందరోజుల ‘బిగ్ బాస్ 2’ ఇప్పటికే 80రోజులకు పైగా పూర్తయ్యింది. ఇంకా మిగిలింది కొద్దిరోజులే. మిగిలిన రోజుల్లో డబుల్ ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు ప్లాన్ చేసినట్టు నాని తెలిపారు. అంతకంటే ముందే ఈ వారం డబుల్ ఎమిలిమినేషన్ ఉండబోతున్నట్టు చెప్పి ఉత్కంఠని పెంచారు. ఈ వారం బయటకు వెళ్లే ఆ ఇద్దరు ఎవరు ? ఆసక్తిగా మారింది. ఐతే, ఇంతలో బిగ్ బాస్ ఇంటి సభ్యులపై నాని బోలేడు నిందలు మోపాడు.

వాస్తవానికి ఇవి మోపింది నాని కాదు. ప్రేక్షకులు పంపించినవి. ఆ నిందలని శనివారం షోలో చదివి వినిపించారు నాని. ఆ నిందల్లో కొన్ని సీరియస్ గా, కొన్ని ఫన్నీగా ఉన్నాయి. శ్యామల రీ-ఎంట్రీకి కరెక్ట్ కాదని నిందమోపారు. రోల్ రైడా ఎమోషనల్ గా నటిస్తున్నారు. గణేష్ వెరీ కన్పూజన్… ఇలా ఇంటి సభ్యులపై బోలేడు నిందలు మోపారు ప్రేక్షకులు. వాటికి ఇంటి సభ్యులు తమదైన శైలిలో సమాధానాలు కూడా ఇచ్చారు. నిందలు మోపడం ఇంకా పూర్తికాలేదు. అవి పూర్తికాగానే మళ్లీ ఎలిమినేషన్ మేటరులోకి వెళ్లనున్నారు నాని.