కళ్యాణ్, తారక్’లకు బాలయ్య పెద్ద దిక్కు

హరికృష్ణ మరణంతో నందమూరి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోలేదనే చెప్పాలి. శుక్రవారం సాయంత్రం హరికృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలపై కళ్యాణ్ రామ్, జూ. ఎన్టీఆర్ లు దగ్గరుండి చూసుకొంటున్నారు. ఈ విషయంలో బాబాయ్ బాలకృష్ణ సలహాలు తీసుకొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హరికృష్ణ అంత్యక్రియలు పూర్తయిన తర్వాతి రోజు శుక్రవారం నందమూరి ఫ్యామిలీ అంతా మెహదీపట్నంలోని హరికృష్ణ నివాసంలోనే ఉంది. ఆ రోజు భోజన సమయంలో కళ్యాణ్ రామ్, ఎన్ టీఆర్ లతో బాలయ్య ముచ్చటిస్తూ కనిపించారు. బహుశా.. హరికృష్ణ అంత్యక్రియల తర్వాత చేయాల్సిన మిగితా పనులపై బాలయ్య సూచనలు ఇస్తున్నట్టు కనబడుతోంది. ఈ వీడియోని షేర్ చేస్తున్న నందమూరి అభిమానులు బాలయ్య పెద్ద దిక్కు అయ్యాడని చెప్పుకొంటున్నారు.

#NTR #NKR #BALAYYA

Posted by Ravi Teja Tarak on Friday, 31 August 2018