కాంగ్రెస్ పార్టీకి అదొక బ్రీడింగ్ సంస్థ‌లాంటిది..

తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని కాంగ్రెస్ నేత భ‌ట్టి విక్ర‌మార్క విమ‌ర్శించారు. ఫీజ్ రీయింబర్స్ మెంట్ పథకాన్ని కేసీఆర్ నీరు గార్చాడంతో పాటు, పేద విద్యార్థులను కేసీఆర్ విద్యకు దూరం చేస్తున్నాడని ఆరోపించారు. పేద విద్యార్థులకు చదువుకునే అవకాశాలు కల్పించింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమేన‌ని చెప్పారాయ‌న‌.

గ‌తంలో సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీలో వేముల‌ రోహిత్ చనిపోతే కనీసం స్పందించని చరిత్ర కేసీఆర్ దని, కానీ రాహుల్ ఢిల్లీ నుంచి నేరుగా సెంట్రల్ యూనివర్సిటీ వచ్చి బాధితుల పక్షాన నిలబడ్డాడని చెప్పారు భ‌ట్టి విక్ర‌మార్క‌. విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్ కు ఉండేడే చిత్తశుద్ధి అలాంటిద‌ని అన్నారాయ‌న‌. రాష్ట్రంలో విద్యార్థుల పక్షాన NSUI పనితీరు అభినందనీయమ‌ని, కాంగ్రెస్ పార్టీకి అదొక బ్రీడింగ్ సంస్థ‌లాంటిదని చెప్పారాయ‌న‌.