పవన్ బర్త్ డే.. చరణ్ సప్రైజ్ గిఫ్ట్ !

బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం సప్రైజ్ ప్లాన్ చేశాడు రామ్ చరణ్. రేపు (సెప్టెంబర్ 2) పవన్ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ప్రస్తుతం పవన్ పొలిటిక్స్ లో బిజీగా అయిపోవడం.. ఆయన్నుంచి అభిమానులకు ఎలాంటి గిఫ్ట్ అందడం లేదు. ఇప్పుడా లోటుని రామ్ చరణ్ తీర్చబోతున్నాడు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చరణ్ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ ని వదలబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఐతే, అంతకుమించిన గిఫ్ట్ ఏదో చరణ్ పవన్ కోసం రెడీ చేసినట్టు లెటెస్ట్ సమాచారమ్.

ఈ విషయాన్ని చరణ్ సతీమణి ఉపాసన ట్విట్టర్ వేదికగా తెలిపింది. చరణ్‌ మాట్లాడుతున్న వీడియోను పోస్ట్‌ చేశారు. ‘రేపటి వరకు ఎదురుచూడండి’ అని ట్వీట్‌ చేశారు. ‘హాయ్‌.. మరో 24 గంటల్లో మీకో సర్‌ప్రైజ్‌ ఉంది. కల్యాణ్ బాబాయ్‌ పుట్టినరోజు సందర్భంగా ఓ వీడియోను పోస్ట్‌ చేయబోతున్నాం. బాబాయ్‌.. నీకు రేపు ఓ సర్‌ప్రైజ్‌ ఉంది’ అని చరణ్‌ వీడియోలో పేర్కొన్నారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అసలు చరణ్‌ సప్రైజ్ ఏమై ఉంటుందని ఊహించడం మొదలు పెట్టారు అభిమానులు.

ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నారు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం చిత్రబృందం అజ‌ర్ బైజాన్‌ వెళ్లింది. తూర్పు ఐరోపాలోని అతి పెద్ద దేశాల్లో ఇదొక‌టి. ఇప్పుడిప్పుడే ప‌ర్యాట‌క ప్రాంతంగా అభివృద్ది చెందుతోంది. ఇక్క‌డ క‌నీ వినీ ఎరుగ‌ని లొకేష‌న్లు ఉన్నాయ‌ట‌. వాటిని రామ్ చరణ్ సినిమాలో చూపించబోతున్నారు బోయపాటి.