‘ప్ర‌గ‌తి నివేద‌న’కు ప‌క‌డ్బందీ భ‌ద్ర‌త‌.

సెప్టెంబ‌ర్ 2న జ‌రిగే ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌కు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తోంది టీఆర్ఎస్. స‌భా ఏర్పాట్ల బాధ్య‌త భుజానికెత్తుకున్న మంత్రి కేటీఆర్ ద‌గ్గ‌రుండి ఎప్ప‌టిక‌ప్పుడు ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్య‌క‌ర్త‌ల‌తో పాటు ఐపీఎస్ అధికారుల‌కు ప్ర‌త్యేక బాధ్య‌త‌లు అప్ప‌గించారు కేసీఆర్. ర‌క్ష‌ణ ప‌రంగా ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా స‌భ స‌జావుగా జ‌రిగి ప్ర‌శాంతంగా ముగిసేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఓవ‌రాల్ స‌భ కోఆర్డినేట‌ర్ గా ఏడీజీ లా అండ్ ఆర్డ‌ర్ జితేంద‌ర్ కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

ప్రగతి నివేదన సభ ఇంచార్జి గా రాచకొండ సీపీ మహేష్ భగవత్ ను, సభ సెక్యూరిటీ ఇంచార్జి గా సైబరాబాద్ సీపీ సజ్జనార్,
ట్రాఫిక్ ఇంచార్జి లు గా ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్ , ఎస్పీ రంగనాథ్ ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. సీఎం సెక్యూరిటీ , రూట్ క్లీరెన్స్ ఇంచార్జి గా ఎస్పీ కోటి రెడ్డి, పబ్లిక్ లోపలికి అనుమ‌తించే అంశంపై ఇంచార్జి గా వరంగల్ సీపీ రవీందర్, పబ్లిక్ కో ఆర్డినేటర్లు గా డీసీపీ జానకి, షర్మిల , ఎస్పీ శశిధర్ రాజు ల‌ను, మీటింగ్ డయాస్ ఇంచార్జి గా దుగ్గల్ కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. మొత్తంగా ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌కు ప‌క‌డ్బందీ భ‌ద్ర‌తా ఏర్పాటు చేస్తోంది స‌ర్కార్.