పవన్ తొలిప్రేమ ఎవరితో తెలుసా ?


మెగా అభిమానులకు మరో పండగొచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పండగొచ్చింది. నేడు (సెప్టెంబర్ 2) పవన్ 46వ పుట్టినరోజుని అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి పవన్ కు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. కొద్దిసేపటిక్రితమే బాబాయ్ పవన్ కు రామ్ చరణ్ సప్రైజ్ గిఫ్ట్ అందజేశారు. ఇప్పుడీ వీడియో గిఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు.. పవన్ నుంచి కూడా బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది. ఐతే, అది సినిమా, రాజకీయానికి సంబంధించిన గిఫ్ట్ కాదు. పర్సనల్ గిఫ్ట్. అవును.. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ తన తొలిప్రేమ కబుర్లు పంచుకొన్నారు.

పవన్‌ కల్యాణ్‌… కల్యాణ్‌గా ఉన్నప్పుడు అంటే సినిమా హీరో కాకముందు ముచ్చట ఇది. పవన్ మద్రాసులో కంప్యూటర్‌ క్లాసులకు వెళ్తున్న రోజులు. తనతో పాటు ఓ అందమైన అమ్మాయి కంప్యూటర్‌ క్లాసులకు వచ్చేదట. పవన్‌తో చాలా క్లోజ్‌గా మాట్లాడేదట. బ్యాచ్‌ ముగుస్తున్న కొద్దీ… వాళ్లిద్దరి మధ్య చనువు పెరగడం మొదలైంది. కల్యాణ్‌ స్నేహితులు మాత్రం ‘ఇది ఫ్రెండ్‌షిప్‌ మాత్రమే కాదు.. ప్రేమ కూడా.. నీ మనసులో మాట చెప్పేయ్‌’ అంటూ ప్రోత్సహించారుట.

ఆ వయసులో పవన్ కు కూడా ‘ఇది ప్రేమేనేమో’ అనుకుని.. ‘ఐ లవ్‌ యూ’ చెప్పడానికి రెడీ అయిపోయాడు. ఇష్టపడుతున్న అమ్మాయి దగ్గరకు వెళ్తున్నప్పుడు ఏదో ఓ ప్రత్యేకత ఉండాలి కదా ? అందుకే ఇంట్లో ఎవరూ వాడకుండా పక్కన పడేసిన డొక్కుకారుని బయటకు తీసి, శుభ్రం చేశాడట. అప్పటికి ఆ అమ్మాయికి ఉద్యోగం కూడా వచ్చేసింది. ఆఫీసు వరకూ ఆ డొక్కు కారులోనే వెళ్లి.. ‘నిన్ను ఇంటి దగ్గర డ్రాప్‌ చేస్తా’ అని ఆ అమ్మాయిని ఎక్కించుకుని కొంత దూరం వచ్చాక.. మధ్యలో కారు ఓ చోట ఆపి.. తన మనసులోని మాట ఇబ్బంది పడుతూనే చెప్పేశాడట.

అదంతా ఓపిగ్గా విన్న అమ్మాయి.. ‘అసలు ప్రేమంటే ఏమిటనుకున్నావ్‌? ఈ వయసులో ప్రేమేంటి’ అంటూ క్లాసు పీకిందట. ‘ఆ సమయంలో ఆ అమ్మాయి మా క్లాస్‌ టీచర్‌లా కనిపించింది. అన్ని క్లాసులు పీకింది..’ అంటూ తన తొలిప్రేమ సంగతుల్ని గుర్తు చేసుకున్నారు పవన్‌. ఇక, పవన్ పర్సనల్ లైఫ్ గురించి తెలిసింది. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకొన్నారు. ఇప్పుడీ విషయంపైనే ప్రత్యర్థులు పవన్ పై దాడి చేస్తుంటారు. పవన్ ని దగ్గర చూసినోళ్లు మాత్రం.. ఆయన దేవుడని చెబుతుంటారు. ఆ దేవుడి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ టీఎస్ మిర్చి డాట్ కామ్.