కేసీఆర్ నోట ‘దొర’ మాట..!
ప్రగతి నివేదన సభలో గతానికి భిన్నంగా కేసీఆర్ మాట్లాడారు. విపక్షాలపై పదునైన విమర్శలుగానీ, రాజకీయంగా కీల నిర్ణయాల ప్రకటనగానీ ఏవీ లేకుండానే స్పీచ్ ను ముగించారు. ప్రత్యేకించి ఏ పార్టీ పేరు పలకకుండా ఆసాంతం తన స్పీచ్ కొనసాగించారు. పరోక్ష విమర్శలనే తప్ప పార్టీలను, వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఎలాంటి ప్రత్యక్ష విమర్శలకు దిగలేదు. అయితే ఈసారి కాస్త కొత్త పదజాలాన్ని వాడారు. ఆయన నోట ఢిల్లీ దొరలంటూ రావడం ఆకట్టుకొంది. కొన్ని పార్టీలు ఢిల్లీ చక్రవర్తులకు బానిసలుగా ఉన్నారని, ఢిల్లీ దొరలకు గులాంగిరి చేద్దామా.. ? లేక మన నిర్ణయాలు మనం తీసుకునేలా ఉండాలా ప్రజలు ఆలోచించాలని ఆయన అన్నారు. ఏదేమైనా కేసీఆర్ నోట దొర పదజాలం రావడం రాజకీయ వర్గాల్లో కాస్త ఆసక్తికరమైన అంశంగా చెప్పుకుంటున్నారు.