అటు ‘ప్రగతి నివేదన’… ఇటు ‘ నిరుద్యోగ ఆవేదన’..
ఒకవైపు కొంగరకలాన్ లో టీఆర్ఎస్ ప్రగతి నివేదన పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంటే మరోవైపు ఉద్యమాల గడ్డ ఉస్మానియాలో టీఆర్ఎస్ సభను నిరసిస్తూ విద్యార్థులు ఆవేదన సభను నిర్వహిస్తున్నారు. నియామకాల విషయంలో నాలుగేళ్లవుతున్నా ప్రభుత్వం సరైన ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడంపై విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఓయూ లైబ్రరీ నుంచి విద్యార్ధులు నిర్వహిస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసుల వైఖరిని నిరసిస్తూ విద్యార్థులంతా లైబ్రరీ వద్దే నిరసన తెలిపారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన నిరుద్యోగ ఆవేదన సభ వరకు విద్యార్ధులు ర్యాలీ నిర్వహించారు. తన ఉనికిని కాపాడుకోవడం కోసమే కేసీఆర్ ప్రగతి నివేదన సభను నిర్వహిస్తున్నారని విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు నిర్వహించే ఈ సభకు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఓయూకు వెళ్లి మద్దతు తెలిపారు.