అప్పుల్లో ప్రియాంక అత్తగారు.. !


గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా త్వరలోనే ప్రియుడు నిక్ జొనాస్‌ను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ముంబైలోని ప్రియాంక ఇంట్లో వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ వేడుకకి నిక్ తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ఐతే, ఇప్పుడు ప్రియాంక అత్తగారింటికి గురించి ఓ భయంకరమైన న్యూస్ బయటికొచ్చింది. ప్రియాంక మామ పాల్ జొనాస్ పీకల్లోతు అప్పుల్లో ఉన్నాడట. ఈ విషయాన్ని ఇంటర్నేషన్ మీడియా హైలైట్ చేస్తూ కథనాలు ప్రసారం చేశాయి.

పాల్ జొనాస్ అమెరికాలో రియల్ ఎస్టేట్ కంపెనీ రన్ చేస్తున్నారు. ఇప్పుడీయన వ్యాపారం భారీ నష్టాల్లో ఉందట. దాదాపు 1 మిలియన్ డాలర్ అప్పుల్లో కూరుకుపోయిందట. దీంతోపాటు ఓ కేసు కారణంగా దాదాపు రెండున్నర లక్షల డాలర్లకుపైగా నష్టపోవాల్సి వచ్చిందట. ఈ కారణంగానే ఆయన కొన్ని ఆస్తులని ఆమ్మేసినట్టు చెబుతున్నారు. ఈ ఇంటికి ప్రియాంక కోడలు కాబోతున్న నేపథ్యంలో పాల్ జొనాస్ అప్పులపై భారతీయ మీడియా ఫోకస్ చేసింది. మామ అప్పుల్లో ఉన్నా.. ప్రియుడు నిక్ మాత్రం భారీగానే సంపాదిస్తున్నాడట. ఆయన యేడాదికి దాదాపు 25 మిలియన్ డాలర్లు సంపాదించాడట.

ఇది వరకు నిక్ ఇద్దరు సోదరులతో కలిసి ఆల్బమ్స్ చేసేవాడు. ఇప్పుడీ సోదరుల బ్యాండ్ బ్రేకప్ అయ్యింది. ఎవరికివారే సొంతగా ఇమేజ్ ని పెంచుకొనే ప్రయత్నంలో ఉన్నారు. సింగర్ గా కాకుండా… నటుడుగా రాణించేందుకు నిక్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘జుమాంజి’ సినిమాలో నిక్ నటనకు ప్రశంసలు దక్కాయి. మొత్తానికి… ప్రియాంక మామ అప్పుల్లో ఉన్నా.. ఆమె ప్రియుడు మాత్రం భారీగానే సంపాస్తున్నారు. ఇది తెలియని కొందరు.. ప్రియాంకని డబ్బుల కోసమే నిక్ పెళ్లాడుతున్నట్టు కనబడుతుందని విమర్శణలు చేస్తున్నారు.

ఇక, నిక్-ప్రియాంకల వివాహం వచ్చే యేడాది అమెరికాలో జరగనుంది. పెళ్లి సింపుల్ గా చేసి.. రిసెప్షన్ పార్టీని గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్ సినిమాలపై ఫోకస్ చేసింది. అక్కడ బిజీ అయిపోవాలని ఆశపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె బాలీవుడ్ సినిమాలని బాగా తగ్గించుకొంటుందనే చెబుతున్నారు.