‘అరవింద సమేత’.. భయపడాల్సిన పనేం లేదట !


తారక్-త్రివిక్రమ్’ల ‘అరవింద సమేత’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన టీజర్ తో ఆ విషయం అర్థమైపోయింది. ఇక, వినాయక చవితి కానుకగా రెండో టీజర్ ని విడుదల చేయబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఇంతలో తారక్ తండ్రి హరికృష్ణ జరిగిపోవడంతో.. నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. రెండో టీజర్ విషయం పక్కన పెడితే.. అసలు సినిమా అనుకొన్న టైం విడుదల అవుతుందా ? అనే సందేహాలు మొదలయ్యాయి. సెప్టెంబర్ 1 నుంచే తారక్ తిరిగి షూటింగ్ లో పాల్గొన్న ఎక్కడో చిన్న పాటి డౌటు కొడుతుండేది.

ఇప్పుడా డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తో పాటు డబ్బింగ్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులు జెడ్ స్వీడుతో జరుగుతున్నాయి. ఈ నెలాఖరులోగా సినిమాకు సంభందించిన అన్ని పనులను పూర్తి చేయాలని త్రివిక్రమ్ టార్గెట్ గా పెట్టుకొన్నట్టు చెబుతున్నారు. అదే జరిగితే.. ‘అరవింద సమేత’ దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమైపోయినట్టే. తండ్రి మరణంతో పుట్టెడు దుఖంలో ఉన్న తారక్ తిరిగి షూటింగ్ లో పాల్గొనడం ఆయన డెడికేషన్ కు నిదర్శనమని చెప్పాలి. ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేసి తండ్రికి అంకితమివ్వాలని తారక్ భావిస్తున్నారు.

ఇక, రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో అరవింద సమేత తెరకెక్కుతోంది. ఫ్యాక్షన్, యాక్షన్ తారక్ కి కొట్టినపిండి. ఎన్ టీఆర్ రంగంలోకి దిగితే ఎట్టుట్టదో టీజర్ తో తెలిసిపోయింది. పూర్తి హవాని సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమాలో తారక్ సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ సంగీతం. రాథాకృష్ణ నిర్మాత.