టీఆర్ఎస్ లో మొదలైన ఎలక్షన్ హంగామా…
ప్రగతి నివేదన సభ ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ నిర్ణయాలను ప్రకటించకపోయినా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మాత్రం ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. నేతల్లో ఇప్పటినుంచే ముందస్తు ఎన్నికల హడావుడి ప్రారంభమైనట్లుగా కనిపిస్తోంది. అందులోనూ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి ఈ విషయంలో కాస్త ముందు వరుసలో ఉన్నారు.
ఎన్నికల కోసం ఇప్పటికే నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తన ప్రచార రథాన్ని సిద్ధం చేసుకున్నారు. ఈ ప్రచార రథాన్ని గుంటూరులో ప్రత్యేకంగా తయారు చేయించిన ఆయన హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఉంచారు. దీంతో అక్కడి సిబ్బంది, ఇతర నేతలు ఈ ప్రచార రథాన్ని ఆసక్తి పరిశీలిస్తున్నారు. ఈ ప్రచార రథం ఎలా ఉందో మీరూ ఓ లుక్కేయండి.