శిరీష్ సినిమాలో జబర్థస్త్ చిన్నారి

అల్లు శిరీష్ సినిమాలో జబర్థస్త్ చిన్నారి బేబీ దీవెన కనిపించబోతుంది. శిరీష్ హీరోగా ‘ఏబీసీడీ’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో దుల్కర్ సల్మాన్ చేసిన ‘ఏబీసీడీ’ సినిమాకి రీమేక్ ఇది. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా రిమేక్ లో బేబీ ‘దీవెన’ కూడా నటిస్తోంది. ‘జబర్దస్త్’ కామెడీ షో చూసేవారికి బేబీ దీవెన గురించి చెప్పవలసిన పనిలేదు. ముద్దు ముద్దు మాటలతో నవ్వించే ఈ చిన్నారికి చాలామంది అభిమానులు వున్నారు. ఈ చిన్నారి తన ఫేవరేట్ అంటూ.. ఆమెతో దిగిన ఒక ఫోటోను శిరీష్ పోస్ట్ చేశాడు.

ఇక, శిరీష్ కెరీర్ స్లో గా సాగుతోంది. ఆయన ఖాతాలో ‘శ్రీరస్తు శుభమస్తు’ ఒక్కటే చెప్పుకోదగ్గ విజయం పడింది. అన్న అల్లు అర్జున్ రేంజ్ లో శిరీష్ రాణించలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే శిరీష్ ని తమిళ్, కన్నడ సినిమాలపై ఫోకస్ చేశారు. సోలో హీరోగా కాకుండా మల్టీస్టారర్ సినిమాలకు మంచి ఆప్షన్ గా శిరీష్ ని మారాలని అల్లు అరవింద ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సూర్య, మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో నటించనున్న తమిళ చిత్రంలో శిరీష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.