మెహ్రీన్ కూడా ఓపెన్ చేసింది

సొంత కాళ్లపై నిలబడాలని ఎవ్వరికైనా ఉంటుంది. అలాగే సినిమాల్లో తమ పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకొని మురిసిపోవాలని కథానాయికలకు ఉంటుంది. ఐతే, బాషపై పట్టులేకపోవడం, బిజీ షెడ్యూల్ కారణంగా నోరుమూసుకొని.. అరవగొంతుతో కానిచ్చేస్తుంటారు. ఇప్పుడీ తీరు మారుతోంది. హీరోయిన్స్ నోరు తెరస్తున్నారు. సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే సమంత , కీర్తి సురేష్, అనుపమ.. సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం మొదలెట్టేశారు.

ఇప్పుడీ లిస్టులో యంగ్ హీరోయిన్ మెహ్రీన్ కూడా చేరిపోయిందని తెలిసింది. ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ తెలుగు తెరకు పరిచయమైన ఈ పంజాబీ బ్యూటీ రాజా ది గ్రేట్, మహానుభావుడు సినిమాలతో విజయాలు అందుకొంది. ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం వెంకీ, వరుణ్ తేజల మల్టీస్టారర్ ‘ఎఫ్ 2’లో నటిస్తోంది. ఈ సినిమాలో తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోనుందట. అందుకు నిర్మాత దిల్ రాజు అనుమతి కూడా లభించినట్టు సమాచారమ్. ఇక, టాలీవుడ్ లో జోరు చూపిస్తున్న పూజా హెగ్డే అరవింద సమేతతో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం మొదలెట్టింది. దీంతో స్వీటీల స్వీట్ వాయిస్ వినబోతున్నాం.