ట్విస్ట్: భ‌ర్త‌ను హ‌త్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీక‌రించిన భార్య‌..!!

వ‌న‌స్థ‌లిపురం పీఎస్ ప‌రిధిలో న‌మోదైన ఓ యాక్సిడెంట్ కేసులో దిమ్మ‌తిరిగే నిజాలు భ‌య‌ట‌ప‌డ్డాయి. క‌ట్టుకున్న భార్యే భ‌ర్త‌ను యాక్సిడెంట్ గా చిత్రీక‌రించిన వైనం పోలీసుల విచార‌ణ‌లో వెలుగు చూసింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్త మరణిస్తే ఉద్యోగం,ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయ‌ని భర్తను హత్య చేసి కారు యాక్సిడెంట్ గా చిత్రీకరించింది భార్య‌..

వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి గుర్రంగూడా వద్ద రెండు రోజుల క్రితం కరెంట్ స్తంభానికి కారు ఢీ కొని తన భర్త అయిన కేస్య నాయక్ మృతి చెందాడు అని వనస్థలిపురం పోలీసుల కు పిర్యాదు చేసింది అతని భార్య ప‌ద్మ‌.
పద్మ పిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు హతుని భార్య పద్మ మరో వ్యక్తి వినోద్ లు కారులో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించార‌ని తేల్చారు పోలీసులు. ఈ కేసులో పద్మ, వినోద్ ల‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కు త‌ర‌లించారు పోలీసులు.