వివాదంలో టీఆర్ఎస్ నేత‌లు…

ఆదివారం ప్ర‌గ‌తినివేద‌న స‌భ నేప‌థ్యంలో టీఆర్ఎస్ నేత‌ల వ్య‌వ‌హార శైలి ఒక్కోచోట ఒక్కో వివాదాన్ని తెచ్చి పెడుతున్నాయి. సామాన్య కార్య‌క‌ర్త‌ల సంగ‌తి అలా ఉంచితే బాధ్య‌త గ‌ల ప‌ద‌వుల్లో ఉండి హుందాగా వ్య‌వ‌హ‌రించాల్సిన వారు క‌నీస విజ్ఞ‌త మ‌రిచిప్ర‌వ‌ర్తించార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే బాబుమోహ‌న్ ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌కు వెళ్లే ముందు జెండా ఊపి ప్రారంభించే కార్య‌క్ర‌మంలో కార్య‌క‌ర్త‌ల‌పైకి కాలు లేప‌డం వివాదాస్పదంగా మారింది. కోపంతో ఊగిపోతూ తంతానంటూ కాలు లేప‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న బాబుమోహ‌న్ వీడియోపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.

ఇక హైద‌రాబాద్ లోనూ ఓ కార్పోరేట‌ర్ వ్య‌వ‌హ‌రించిన తీరుపై సొంత పార్టీ నేత‌లే తిట్టుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. రామాంతాపూర్ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రగతి నివేదన సభకు బయలుదేరేముందు కార్యకర్తలతో కలిసి ర్యాలీ తీశారు. ఆ ర్యాలీలో గాల్లోకి డ‌బ్బులు వెదజల్లారు. దీంతో డప్పులు కొట్టేవారు ఆ డబ్బులను ఏరుకున్నారు.తీరా అవి కాగిత‌పు నోట్ల‌ని తేల‌డంతో వాటిని రోడ్డుపైనే ప‌డేసి వెళ్లిపోయారు. ఇది చూసిన వారంతా బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన నేత‌లు గాల్లోకి డ‌బ్బులు విస‌ర‌డ‌మేంట‌ని, అదీ పేప‌ర్ నోట్స్ విస‌ర‌డ‌మేమిటంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు ఈ వీడియో కూడా సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్ లో స‌ర్క్యూలేట్ అవుతోంది..

ర్యాలీలో డ‌బ్బులు వెద‌జ‌ల్లుతున్న దృశ్యం…