‘నోటా’ ట్రైలర్.. ముహూర్తం ఖరారు !
ఇష్టం లేదంటూనే రాజకీయాలు చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఆయన నటిస్తున్న ద్విబాష చిత్రం ‘నోటా’. ఆనంద్ శంకర్ దర్శకుడు. విజయ్ కి జంటగా మెహ్రీన్ నటిస్తున్నారు. చెన్నై సూపర్ మోడల్ సంచన నటరాజన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. శంకర్ -ఎసన్-లాయ్ సంగీతం అందిస్తున్నారు. జ్ఝానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పుడీ సినిమా థియేట్రెకల్ ట్రైలర్ కి ముహూర్తం ఫిక్సయ్యింది. రేపు (సెప్టెంబర్ 4)న సాయంత్రం 4గంటలకు ట్రైలర్ ని వదలబోతున్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు హీరో విజయ్ దేవరకొండ. ‘అసలు రాజకీయాలంటే నాకు ఇష్టముండదు. ఐతే, ఒకవేళ నేను రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందన్నది..నోటా లో చూడొచ్చు’ అంటూ ట్రైలర్ రిలీజ్ డేటుని ప్రకటించాడు విజయ్.
అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరో అనిపించుకొన్నాడు విజయ్. ఇప్పుడు ‘నోటా’తో కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. యూత్ ని ఇట్టే ఆకట్టుకొనే విజయ్.. ఓ పొలిటికల్ థ్రిల్లర్ తో కోలీవుడ్ కు పరిచయం కాబోతుండటం విశేషం. బహుశా.. తెలుగు, తమిళ్ లో డిఫరెంట్ ఇమేజ్ ని సొంతం చేసుకొనేందుకు విజయ్ ప్లాన్ చేసుకొని ఉండొచ్చు. కోలీవుడ్ లోనూ మన కిర్రాక్ హీరో రాణించాలని కోరుకొందాం.
I bloody hate politics.
But if I have to do it.
This is how I get it done.#NOTA48 hours to Sneak Peak.
72 hours to Trailer. pic.twitter.com/aI2enf6Wja— Vijay Deverakonda (@TheDeverakonda) September 3, 2018