సోనాలి.. ఇప్పుడు సూపర్ !

సోనాలి బింద్రే.. బంగారం. ఆమె ముసి ముసి నవ్వులు… జుట్టు ఆమె అందానికి మణిపూసలు. ఇప్పుడీ బంగారం లాంటి హీరోయిన్ క్యాన్సర్‌తో‌ బాధపడుతూ న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. చికిత్సలో భాగంగా ఆమె గుండు చేయించుకొన్నారు. దానికి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొన్నారు. ఆ ఫోటోలు చూసి ఆమె అభిమానులు గుండెలు పగిలిపోయాయి. మురారి, ఖడ్గం, ఇంద్ర.. సినిమాల్లో చూసిన సోనాలి యేనా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. అంతలోనే తేరుకొని ఆమె త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థించారు.

ఆ ప్రార్థనలు ఫలిస్తున్నాయి. సోనాలి ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతున్నట్టు చెబుతున్నారు. అంతేకాదు.. సోనాలికి మళ్లీ జుట్టు కూడా వచ్చేసింది. ఐతే, అది సజమైనది కాదు. ప్రత్యేకంగా ఓ విగ్ చేయించుకొన్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. మళ్లీ జుట్టుతో ఉన్న ఫోటోలని అభిమానులతో పంచుకొన్నారు సోనాలి.

‘నేను అందంగా ఉంటేనే సౌకర్యంగా ఫీల్‌ అవుతానని అర్థమైంది. తలకు స్కార్ఫ్‌ కట్టుకునే ఉద్దేశం ఉంటే అలానే చేసేదాన్ని. గుండుతో తిరగాలి అనుకుంటే తిరిగేదాన్ని. ఏం చేస్తే సంతోషంగా ఉంటారో కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది కదా. కాబట్టి నచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకునేందుకు ప్రయత్నించాలి. నాకు ‘బోకీ హెయిర్‌’ (విగ్గుల తయారీ సెలూన్‌) గురించి చెప్పినందుకు ధన్యవాదాలు ప్రియాంకా చోప్రా. వాళ్లు నా కొత్త లుక్‌ను సృష్టించారు’ అని సోనాలి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఓ వీడియోను, ఫొటోను కూడా షేర్‌ చేశారు.

"Vanity is my favourite sin." – Al Pacino Well, it might not be my all-time favourite sin (that would be gluttony 😋), but who doesn't like looking good? The way we look has a profound psychological impact on us… A little vanity here and there does no one any harm. It's important to do what makes you happy, even if it's something as simple as wearing a wig, bright red lipstick, high heels…. All that white noise doesn't make a difference in the larger picture. No one can tell you what's right or wrong for you. When I was testing out the wigs, I had a brief moment of self-doubt… "Am I vain for wanting to look good?" As part of the entertainment industry, you're always expected to look good… Maybe that has been ingrained in me? But then I gave it a thought and I realized I like looking good for me. If I'm in the mood to wear a scarf, I will. If I want to walk around bald and free, I will. Only you know what would make you feel good, and what works best for you. So take every opportunity you can to #SwitchOnTheSunshine. #OneDayAtATime 🙏🌞 Thank you @priyankachopra for connecting me with the amazing @bokheehair, who created my new look.

A post shared by Sonali Bendre (@iamsonalibendre) on