ఏపీలోనూ టీఆర్ఎస్ పోటీ


తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తుకు వెళ్లేందుకు రెడీ అవుతోంది. శుక్రవారమే (సెప్టెంబర్ 6) ప్రభుత్వాన్ని రద్దు చేసి.. ఎన్నికలకు పోయేందుకు ముహూర్తం పెట్టుకొన్నట్టు సమాచారమ్. అంతేకాదు.. ఏపీలోనూ పోటీకి టీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్టు కనబడుతోంది. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలని విజయవాడలో ఘనంగా నిర్వహించడం చూశాం. అదే సమయంలో టీఆర్ ఎస్ ఏపీలోనూ పోటీ చేయాలని కొందరు ఆకాంక్షించారు. దీనిపై కేటీఆర్ ఆసక్తికరంగా స్పందించారు. భవిష్యత్ లో ఏమీ జరుగుతుందో చెప్పలేం అన్నారు. తాజాగా, ఏపీలో పోటీ చేయడంపై కేటీఆర్ స్పందించడం హాట్ టాపిక్ గా మారింది.

బుధవారం మంత్రి కేటీఆర్ రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో రూ.5కోట్ల వ్యయంతో నిర్మించే మున్సిపల్‌ భవనం, కళాక్షేత్రం భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతోంది. కేసీఆర్‌ లాంటి ముఖ్యమంత్రి తమకుంటే బాగుంటుందని పొరుగు రాష్ట్రం ప్రజలు కోరుకుంటున్నారని.. వచ్చే ఎన్నికల్లో తెరాస ఏపీలోనూ పోటీ చేయాలని విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. మరీ.. నిజంగానే టీఆర్ఎస్ ఏపీలోనూ పోటీకి దిగుతుందా.. ? లేదంటే ఆ విజ్ఝప్తులని కేవలం పబ్లిసిటీ కోసమే వినియోగించుకోనుందా.. ? అనేది మరి కొన్ని నెలల్లో తేలనుంది.