అవ్..చెన్నారెడ్డి కంటే మొగోన్నే..!!

అసెంబ్లీ ర‌ద్దు, అభ్య‌ర్థుల జాబితాపై ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో తాను మొగోన్నంటూ కేసీఆర్ క్రెడిట్ ఇచ్చుకున్నారు. మీడియా స‌మావేశం అనంత‌రం ఓ జ‌ర్న‌లిస్టు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెబుతూ కేసీఆర్ అలా మాట్లాడారు. ఎన్టీఆర్ కంటే మొగోడా, చంద్ర‌బాబు కంటే మొగోడా .. ఇవేం ప్ర‌శ్న‌లు అంటూ సంభోదిస్తూ అట్ల‌యితే చెన్నారెడ్డి కంటే తాను మొగోన్ని కాదా అంటూ బ‌దులిచ్చారు. చెన్నారెడ్డి తెలంగాణ తేవ‌డంలో ఫెయిల్ అయ్యార‌ని, తాను తెలంగాణ తెచ్చాన‌ని స‌మాధానం చెప్పారు కేసీఆర్.