బాబుమోహ‌న్ కు మొండిచేయి..

అసెంబ్లీ ర‌ద్దు త‌రువాత అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించిన కేసీఆర్ సిట్టింగుల‌కే పెద్ద‌పీట వేశారు. 105మంది అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించిన కేసీఆర్ ఇద్ద‌రు సిట్టింగుల‌కు టిక్కెట్ ఇవ్వ‌డానికి నిరాక‌రించారు. అందోల్ నియోజ‌క‌వ‌ర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బాబూ మోహ‌న్ కు బ‌దులు జ‌ర్న‌లిస్టు నాయ‌కుడు కాంతికిర‌ణ్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కేసీఆర్ చెన్నూర్ నియోజ‌క‌వ‌ర్గంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే ఓదేలుకు మొండిచేయి చూపించారు. ఇద్ద‌రు సిట్టింగుల‌కు త‌ప్ప మిగ‌తా సిట్టింగులంద‌రికీ టిక్కెట్లు ప్ర‌క‌టించారు. మిగ‌తా 14నియోజ‌క‌వ‌ర్గాలకు సంబంధించి వారం, ప‌దిరోజుల్లో జాబితా ప్ర‌క‌టిస్తామ‌ని కేసీఆర్ చెప్పారు.

టిఆరెస్ అభ్యర్థుల‌ లిస్ట్ లో వరంగల్ తూర్పు నియోజక వర్గం‌ అభ్యర్థి పెండింగ్ లో ఉంచారు. కొండా సురేఖకు మొండిచేయి తప్పద‌ని టిఆరెస్ వర్గాలు చెబుతున్నాయి. కొండా దంప‌తులు ఉద‌యం నుంచి కార్యక‌ర్త‌ల‌కు అందుబాటులో లేక‌పోవ‌డం కూడా ఈ వాద‌న‌కు బ‌లాన్ని చేకూరుస్తుంది. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో పీసీసీ చీఫ్ ఉత్తమ్, ఆయన సతీమణి పద్మావతి ప్రాతినిద్యం వహిస్తున్న హుజుర్ నగర్, కోదాడలలో అభ్యర్థులను ప్ర‌క‌టించ‌లేదు.