కేసీఆర్ – సూపర్ స్టార్ !
ఇప్పుడు సీఎం కేసీఆర్ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. ఆయన ముందస్తు వెళ్తున్నారు. నేటి తెలంగాణ కేబినేట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నారని.. జాతీయ మీడియాలోనూ కథనాలు ప్రచురితం అయ్యాయి. ఇదే సమయంలో కేసీఆర్ కు ప్రముఖ మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డుకు ఎంపిక చేసింది. అక్టోబర్ 27న ముంబయిలో అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. అవార్డుల ప్రదానోత్సవానికి హాజరుకావాలని సీఎం కేసీఆర్కు ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమానికి హాజరుకావడానికి కేసీఆర్ అంగీకరించారు. ఈ రెండు అంశాలతో కేసీఆర్ జాతీయనేతలని మించి హెడ్ లైన్స్ లో నిలిచారు.
కేసీఆర్ కంటే ముందే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ముందస్తుపై ఆలోచనలు చేసింది. ఐతే, ఆ తర్వాత ముందస్తుపై వెనకడుగు వేసింది. కేసీఆర్ మాత్రం ముందు నుంచి ముందస్తుపై మనసుపారేసుకొన్నారు. ఇప్పుడది ఆచరణలోనూ పెడుతున్నారు. కేసీఆర్ ముందస్తు నిర్ణయం నేపథ్యంలో.. దాని లాభనష్టాలపై దేశ వ్యాప్తంగా ఇటు రాజకీయ వర్గాలు, అటు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఏదేమైనా.. కేసీఆర్ గట్స్ కి మెచ్చుకోవాల్సిందే. ఇక, ‘ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డు’కు ఎంపికైన ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీఎస్ మిర్చి శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
The EconomicTimes has conferred the prestigious ET Business Reformer of the year Award to Sri KCR Garu, who yet again proves himself as undisputed leader of Agitation & Administration !! KCR -Super Star !! @EconomicTimes @trspartyonline pic.twitter.com/Uzu9RnSGSl
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 6, 2018
Delighted that @EconomicTimes has decided to confer the prestigious ET Business Reformer of the year Award to Hon’ble @TelanganaCMO Sri KCR Garu 😊 👏
— KTR (@KTRTRS) September 5, 2018