ఎమ్మెల్యే ప‌ద‌వికి రేవంత్ రాజీనామా..స్పీక‌ర్ కు అంద‌జేత‌..!!

ముఖ్య‌మంత్రి కేసీఆర్ అసెంబ్లీ ర‌ద్దు, ముంద‌స్తు వార్త‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ నేత అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రేవంత్ రాజీనామా చేశారు. స్పీక‌ర్ ఫార్మాట్ లో ఉన్న రాజీనామా లేఖ‌ను ఆయ‌న స్పీక‌ర్ కు స‌మ‌ర్పించారు. తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ చేరిన ఆయ‌న గ‌తంలో చంద్ర‌బాబుకు త‌న రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పించారు. అయితే అప్పటి నుంచి అది అలాగే పెండింగ్ లో ఉండిపోయింది. అసెంబ్లీ ర‌ద్దు పై గంద‌ర‌గోళం నెల‌కొన్న నేప‌థ్యంలో రేవంత్ రాజీనామా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.