సునీల్ ని సమస్యలో పడేసిన నరేష్

సునీల్ ని సమస్యల్లో పడేశాడు అల్లరోడు. ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడట. వీరిద్దరు కలిసి నటించిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. భీమనేని శ్రీనివాస రావు దర్శకుడు. పూర్ణ, చిత్ర శుక్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్ టైనర్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లరి నరేష్ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఇందులో నరేష్ వీరబాబు పాత్రలో కనిపించబోతున్నాడు. లేడీస్‌ టైలర్‌ అయిన వీరబాబుకి ఎమ్మెల్యే కావాలనేది కోరిక. దాంతో ఎవరు తన దగ్గరికొచ్చినా వాడుకొంటుంటాడు. కొన్ని విషయాల్లో పక్కనున్న స్నేహితుడిని బుక్‌ చేసేస్తుంటాడు. అలా నా కోసం సునీల్‌ ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటుంటాడు ? వాటి నుంచి ఎలా బయటపడతాడు? అనే విషయాలతో ఆద్యంతం సరదాగా సాగుతుందట.. ఈ చిత్రం. ఇక, వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్, సునీల్ ఈ సినిమాపై బోలేడు ఆశలు పెట్టుకొన్నారు.