2.O’ టీజర్.. కౌంట్ డౌన్ స్టార్ట్ !

సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో ‘2.ఓ’ టీజర్’కు ముహూర్తం ఖరారైంది. వినాయక చవితి కానుకగా ఈ నెల 13న టీజర్ ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు శంకర్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ట్విట్టర్ ఓ పోస్టర్ ని షేర్ చేశారు. మరో ఐదు రోజుల్లో ‘2.ఓ’ టీజర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ఆ పోస్టర్ ద్వారా తెలియజేశారు. టీజర్ రిలీజ్ తో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైపోనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సినిమాపై హైప్ పెంచేందుకు ప్రమోషన్స్ ప్లాన్ చేసినట్టు సమాచారమ్.

దాదాపు రూ. 500కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రమిది. రోబో అంతకుమించి రోబో ‘2.ఓ’ని ప్లాన్ చేశాడు దర్శకుడు శంకర్. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ విలన్ గా కనిపించబోతున్నారు. ఎమీ జాక్సన్ హీరోయిన్. ఈ సినిమాని నవంబర్ 29న రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
కబాలి, కాలా సినిమాల ప్లాపులతో దాహంతో ఉన్న రజనీ అభిమానుల పూర్తిగా తృప్తిపరిచే సినిమా ఇదని చెబుతున్నారు.