సూపర్ స్టార్.. రెండు గిఫ్టులు !

సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి అభిమానులకు రెండు గిఫ్టులు వచ్చేశాయ్. కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీ నటిస్తున్న సినిమా తమిళ్ టైటిల్ ని ఖరారు చేశారు. ‘పేట్టా’ అనే టైటిల్ ని పెట్టారు. మోషన్ పోస్టర్ ని వదలారు. ఇందులో తలైవా చాలా స్టైలిష్, మాస్‌గా కనిపించారు. ఆయన లుక్‌ అభిమానుల్ని ఆకట్టుకుంది. ఈ చిత్రంలో రజనీ సరసన త్రిష జతకట్టనుంది. రజనీతో త్రిషకు ఇదే తొలిసారి. విజయ్‌ సేతుపతి, సిమ్రన్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ.. కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇక, సూపర్‌ హిట్‌ ‘రోబో’కు సీక్వెల్‌గా వస్తోన్న ‘2.ఓ’ టీజర్ రిలీజ్ డేటుని ఖరారు చేసుకొంది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 13న 2.ఓ టీజర్ ని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. అమీ జాక్సన్‌ హీరోయిన్. బాలీవుడ్‌ స్టార్ అక్షయ్‌ కుమార్‌ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని నవంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.