అల్లుడులో ఆ పవర్ ఉంది


అల్లుడు నాగ చైతన్యలో పవర్ ఉంది అంటున్నాడు దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలాజారెడ్డి అల్లుడు’. శైలాజారెడ్డిగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, ఆమె కూతురుగా అను ఇమ్మాన్యూయేల్, ఆమె అల్లుడుగా నాగ చైతన్య నటించారు. అత్తకు ఈగో ఉంటే.. కూతురికి కూడా ఈగో ఉంటుంది. వీరిద్దరి మధ్య నలిగిపోతూ.. వారికి నచ్చజెప్పి హీరో ఎలా పెళ్లి చేసుకున్నాడనేది ఈ సినిమా కథ. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న మారుతి.. ‘శైలజా రెడ్డి అల్లుడు’ టైటిల్‌ పాతదే కానీ.. కథ కొత్తది తెలిపారు. ‘సమరసింహారెడ్డి’ టైటిల్‌లో పవర్‌ ఉంది. ‘శైలాజారెడ్డి అల్లుడు’లోనూ ఆ ధ్వని వినిపిస్తుంది.

చైతూ నటనలోనూ ఆ పవర్ కనిపిస్తోంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో చైతూలో నాగార్జున కనిపిస్తారు. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో రమ్యకృష్ణ, నాగ చైతన్య పోటీపడి మరీ నటించారని తెలిపారు మారుతి. వెన్నెల కిశోర్‌ పాత్ర నవ్వులు పూయిస్తుంది. ఆయన ఇందులో ప్రకృతిని ప్రేమికుడుగా కనిపించనున్నాడు. మొత్తంగా.. ‘శైలాజారెడ్డి అల్లుడు’ టైటిల్ లోనూ, అల్లుడు చైతూలోనూ పవర్ ఉందని మారుతి చెబుతున్నాడు. ఆ పవర్ సత్తా ఏంటో.. ? ఈ నెల 13న తేలిపోనుంది. ఎందుకంటే.. ఆ రోజేనే అల్లుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.