పొత్తులపై టీటీడీపీలో క్లారిటీ వచ్చేనా… ?
అసెంబ్లీ రద్దుతో రాష్ట్రంలో ఎన్నికల రాజకీయాలు స్పీడందుకున్న నేపథ్యంలో తెలంగాణలో పార్టీల నేతల భేటీలు రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. టీఆర్ఎస్ ది ఒంటరి పోరేనని కేసీఆర్ స్పష్టం చేయడంతో ఇక ఆ పార్టీతో పొత్తు ఆలోచన చేయడంలేదు పార్టీలు. ఇక విపక్ష కాంగ్రెస్ తో టీటీడీపీ పొత్తు కుదుర్చుకుంటుందంటూ గత కొంత కాలంగా ఊహాగానాలు వినిపస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై ఇక త్వరలోనే క్లారిటీ రానుంది.
శనివారం హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో ఏపీసీఎం, టీడీపీ అధినేత టీటీడీపీ నేతలో భేటీ అవుతన్నారు. ఈ భేటీలో ఎన్నికల వ్యూహంపై శ్రేణులకు దిశా నిర్దేశం చేయడంతో పాటు పొత్తులపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్, బీజేపీ అంతర్గత ఒప్పందంతో ముందుకు వెళుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ను ఓడించేందుకు కాంగ్రెస్ తో పొత్తు అంశాన్ని ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. సొంతంగా పోటీ చేస్తే వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ అనే ఆలోచనలో టీటీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తో పొత్తుకు వెళితే ఏపీలో ఆ ప్రభావం ఎంతమేరకు ఉండవచ్చు అనే అంశంపైనా ఏపీ నేతలతో చంద్రబాబు ఇప్పటికే చర్చించారు. తాను చెప్పాల్సిన విషయాలను చెప్పి, పలు సూచనలు చేసి పొత్తుల అంశంపై టీటీడీపీ నేతలకే వదిలేస్తారని కూడా ఏపీ నేతలు చెబుతున్న మాట. ఎన్నికల ప్రచారానికి సంబంధించి దిశానిర్దేశంతో పాటు కాంగ్రెస్ తో పొత్తు అంశంపై చంద్రబాబు క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది.