సీక్రెట్‌ : ‘అరవింద సమేత’లో అమితాబ్ !

ఈ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న త్రివిక్రమ్-తారక్’ల ‘అరవింద సమేత’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఎన్టీఆర్ యాక్షన్ లోకి దిగితే ఎట్టుట్టదో టీజర్ తోనే అర్థమైంది. ఇక సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని మరోసారి చూడబోతున్నాం. ఐతే, ఇప్పుడీ సినిమా గురించి ఓ బిగ్ న్యూస్ బయటికొచ్చింది. ఇందులో బిగ్ బీ అమితాబ్ కనిపించబోతున్నారంట. ఆయన గెస్ట్ రోల్ అని చెబుతున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం సీక్రెట్ ఉంచుతోందట. బహుశా.. అభిమానులకు సప్రైజ్ ఇచ్చేందుకే అమితాబ్ ని దాచిపెడుతున్నారమో.. !

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్ది’ చిత్రంలో అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సమరయోధుడు నర్సింహారెడ్డికి గురువుగా బిగ్‌బీ కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఇటీవల కొద్దిరోజుల పాటు బిగ్ బీ హైదరాబాద్ లోనే ఉన్నారు. ఆ సమయంలోనే త్రివిక్రమ్ విజ్ఝప్తి మేరకు ‘అరవింద సమేత’ కోసం బిగ్ బీ టైం కేటాయించారని చెబుతున్నారు. అరవింద సమేతలో బిగ్ బీ ఒకట్రెండు నిమిషాల పాటు గెస్ట్ రోల్ లో మెరవనున్నట్టు సమాచారమ్. ఇదే నిజమైతే.. అరవింద సమేతకు మరింత బలం చేకూరినట్టే.

ఇక, ఇప్పటికే ‘అరవింద సమేత’ షూటింగ్ ముగిసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మాత్రం కొనసాగుతున్నాయి. మరోవైపు, సినిమా ప్రమోషన్స్ కోసం చిత్రబందం ప్లాన్ చేసింది. ఈ సినిమా నుంచి వినాయక చవితి కానుకగా రెండో రాబోతుందని చెబుతున్నారు. ఇక, వచ్చే నెల రెండో వారం నుంచి ప్రమోషన్స్ కార్యక్రమాల్లో వేగం పెంచనున్నారు. పాటలు, ట్రైలర్, ప్రీ-రిలీజ్ వేడుక.. వరుసగా ప్లాన్ చేయనున్నారు. ఈ చిత్రంలో తారక్ సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. థమన్ సంగీతం. రాథాకృష్ణ నిర్మాత.