గ్రేట్ : పవన్ ని ఒప్పించిన దర్శకుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. ఓ సినిమా కోసం పవన్ ని ఒప్పించాడు దర్శకుడు డాలీ (కిషోర్ పార్థసారధి). పవన్ తో ‘గోపాల గోపాల’, ‘కాటమరాయుడు’ సినిమాలు చేశాడు డాలీ. ప్రస్తుతం ఈ దర్శకుడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ని తెరకు పరిచయం చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే వైష్ణవ్ కోసం కథని రెడీ చేశాడట. త్వరలోనే సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఐతే, ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం పవన్ ని ఒప్పించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారమ్.

‘అజ్ఝాతవాసి’ తర్వాత పవన్ మరో రెండు సినిమాలు చేస్తాడని పవన్ అభిమానులు ఆశపడ్డారు. ఐతే, ఇంతలోనే పవన్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. దీంతో ఇప్పట్లో పవన్ ని తెరపై చూడటం సాధ్యం కాదనే నిరాశలో ఉన్నారు అభిమానులు. ఇటీవల జరిగిన పవన్ బర్త్ డే ఎలాంటి హడావుడి లేకుండా చప్పగా ముగిసింది. ఇలాంటి సమయంలో దర్శకుడు డాలీ పవన్ ని ఒప్పించాడనే న్యూస్ తెలిసి మెగా అభిమానులు ఎగిరిగెత్తులేస్తున్నారు.