చైతూ చిలిపి.. !
నాగ చైతన్యలో చిలిపితనం కూడా ఉందంటున్నారు ఆయన తండ్రి నాగార్జున. మారుతి దర్శకత్వంలో నాగ చైతన్య-అను ఇమ్మాన్యూయేల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ చైతూ అత్తగా నటిస్తున్నారు. ఈ శుక్రవారం శైలజారెడ్డి అల్లుడు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఆదివారం హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకి దేవదాస్’లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో నాగ్ మాట్లాడుతూ.. ‘అందరు అనుకొంటారు చైతూ చాలా సాప్ట్, చక్కగా ఉంటాడు. చైతూ బంగారం అనుకొంటారు అందరు. కాదు.. అతనిలో చిలిపితనం కూడా ఉంది. దాన్ని దర్శకుడు మారుతి సినిమాలో అక్కడక్కడ వాడుకొన్నాడు’ అన్నారు.
ఇక, అత్త రమ్యకృష్ణని ఆకాశానికెత్తేశాడు నాగ్. ‘మా కాంబినేషన్ లో ఎన్నో ఎనెన్నో సూపర్ హిట్ చిత్రాలొచ్చాయి. బాహుబలి తర్వాత రమ్యకృష్ణ అంటే భారతదేశంలో తెలియనివారు లేరు. రమ్య నడుస్తుంటే.. రమ్య నవ్వుతుంటే.. రమ్య మాట్లాడుతుంటే.. అలా కళ్లు అప్పగించే చూడాల్సిందే. ఆమెతో ఏ సీన్ అయినా బ్రహ్మాండంగా పండుతుందన్నారు’.