టీఆర్ఎస్’పై టీడీపీ ప్రతీకారం తీర్చుకొనే దారి దొరికేసిందా.. !?

తెలంగాణలో టీఆర్ఎస్ ని గట్టి దెబ్బ కొట్టే ప్రయత్నాలని మొదలెట్టింది టీ-టీడీపీ. ఆ పార్టీ ‘మహాకూటమి’ ఏర్పాటు దిశగా చర్చలు ప్రారంభించింది. టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్ తో కలిసి మాహాకూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే జరిగిన చర్చల్లో టీడీపీ-సీపీఐ పొత్తు ఖరారైంది. కాంగ్రెస్, టీజేఎస్ తోనూ ఆ పార్టీ చర్చలు జరపనుంది. ఆ రెండు పార్టీలు కూడా టీడీపీ కలిసి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారమ్.

మహాకూటమి ఏర్పాటుయే కాదు. ఎక్కడ ఏ పార్టీకి బలం ఉంటే అక్కడ ఆ పార్టీకి టికెట్ ఇవ్వాలని ప్లాన్ చేసినట్టు సమాచారమ్. దీనికి వ్యూహా రచన చేసింది టీడీపీ అధినేత, చంద్రబాబు కావడంతో.. పక్కా ప్లానింగ్ తో మహాకూటమి ఏర్పాటు కానుందని తెలుస్తోంది. ఈ సారి కాంగ్రెస్ కు మునపటి కంటే ఎక్కువ సీట్లు వస్తాయనే టాక్ ఉంది. ఇక, తెలుగు దేశానికి తెలంగాణలో ఇప్పటికీ మంచి క్యాడర్ ఉంది. కోదండరామ్ ఆధ్వర్యంలోని టీజేఎస్ కు విద్యావంతులు, విద్యార్థుల సపోర్టు బలంగా ఉంది. ఈ నేపథ్యంలో.. మహాకూటమితో.. రాష్ట్ర విభజన తర్వాత టీ-టీడీపీని దాదాపు ఖాళీ చేసిన టీఆర్ ఎస్ పై ఆ పార్టీ ప్రతికారం తీర్చుకొనేలా కనబడుతోంది.