సుస్మితా బెల్లీ డ్యాన్స్‌.. చూశారా ?

మాజీ విశ్వసుందరి, బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్‌ ఊపేసింది. ఆమె చేసిన బెల్లీ డ్యాన్స్‌ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. 1999లో తాను నటించిన ‘సిర్ఫ్‌తుమ్‌’ చిత్రంలోని దిల్బర్‌‌ పాటకు సుస్మిత తన జిమ్‌లో డ్యాన్స్‌ చేశారు. చేతులు పైకి పెట్టి నడుము తిప్పుతూ సుస్మితా చేసిన డ్యాన్స్‌ కెవ్వుకేక అంటున్నారు నెటిజన్స్. ఈ వీడియోను ఇప్పటి వరకు ఎనిమిది లక్షల మందికిపైగా లైక్‌ చేశారు. లక్షకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ప్రస్తుతం సుస్మితా పలు రియాల్టీ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. ఆమె చివరిగా 2015లో ‘నిర్భాక్’ అనే బెంగాలీ చిత్రంతో నటించారు. త్వరలో ఆమె ‘హ్యాపీ యానివర్సరీ’ అనే చిత్రంలో నటించబోతున్నారు.