జగ్గారెడ్డిపై 8 సెక్షన్ల కింద కేసులు…
2004లో నకిలీ పత్రాలు, పాస్‌పోర్ట్‌తో మానవ అక్రమ రవాణా చేసిన కేసులో అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై ఎనిమిది సెక్షన్ల కింద కేసులు పెట్టారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. టాస్క్ ఫోర్స్ డీసీపీ కార్యాలయంలో 3 గంటలు పాటు జగ్గారెడ్డిని విచారించి అరెస్ట్ చేసిన పోలీసులు, గుజరాత్ కి చెందిన ముగ్గురుని తన కుటుంబ సభ్యులుగా చేర్చి అమెరికాకి తరలించినట్లు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో జగ్గారెడ్డిపై ఐపీసీ 419, 490, 467, 468, 471, 370, పాస్ పోర్ట్ యాక్ట్ సెక్షన్ 12, ఇమ్మిగ్రేషన్ యాక్ట్ 24 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. గాంధీ ఆస్పత్రిలో జగ్గారెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు.