‘అ అ అ’ అక్కడకు వచ్చింది !
శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ ‘అమర్ అక్భర్ ఆంథోనీ’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఇలియానా టాలీవుడ్ కు రీ-ఎంట్రీ ఇవ్వబోతుంది. సీనియర్ హీరోయిన్ లయ కీలక పాత్ర లో కనిపించనుంది. ఆమె రవితేజ తల్లి పాత్రలో కనిపించబోతుందని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ 70 శాతం అమెరికాలోనే జరిగింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ సినిమా నలుగురికి కీలకంగా మారనుంది. దర్శకుడు శ్రీనువైట్ల వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు. మాస్ మహారాజా రవితేజది ఇంచు మించు అదే పరిస్థితి. ‘రాజా ది గ్రేట్’ సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చినట్టు కనిపించినా రవితేజ.. ఆ తర్వాత టచ్ చేసి చూడు, నేల టికెట్ తో మళ్లీ ప్లాపులు పలకరించాయి. ఇక, ఇలియానా, సునీల్ ల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఈ నలుగురి జీవితాలు ‘అ అ అ ‘ ఆధారపడి ఉన్నాయి. మరీ.. శ్రీనువైట్ల ఈసారైనా మాయ చేస్తాడేమో చూడాలి.