ఇది రాజ‌కీయ క‌క్ష సాధింపు చ‌ర్య‌..

త‌న అరెస్ట్ పూర్తిగా రాజ‌కీయ క‌క్ష సాధింపు చర్యేన‌ని కాంగ్రెస్ నేత జ‌గ్గారెడ్డి ఆరోపించారు. కేసీఆర్, హ‌రీష్ రావు క‌లిసి త‌న‌ను జైల్లో పెట్టాల‌నుకుంటున్నార‌ని, రాహుల్ గాంధీ స‌భ త‌రువాత త‌న అరెస్ట్ పై కుట్ర ప‌న్నార‌ని ఆయ‌న అన్నారు. సిద్ధిపేటలో తమ అభ్యర్థిని గెలిపించేందుకే ఈ అరెస్టు చేశార‌న్నారాయ‌న‌. కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి జైలుకు పంపేందుకు కేసీఆర్, హరీష్ రావు రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆయ‌న ఆరోపించారు. తాను ఎవరిని విదేశాలకు తీసుకెళ్లలేదని ఆయ‌న చెప్పారు. కేసీఆర్, హరీష్ రావ్ ల పై కూడా నకిలీ పాస్ పోర్ట్ కేసులున్నాయని ఆయ‌న విమ‌ర్శించారు.