జూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల ద‌ర‌ఖాస్తు గడువు పొడ‌గింపు.

జూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల ద‌ర‌ఖాస్తు గ‌డువు మ‌రో రెండు రోజుల పాటు పొడ‌గిస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణ‌యం తీసుకుంది. ఈనెల‌ 11తో ముగియాల్సిన ఫీజు చెల్లింపు గ‌డువును ఈ నెల 13 వ‌ర‌కు పొడిగించిన ప్ర‌భుత్వం, ఈనెల 12తో ముగియాల్సిన ద‌ర‌ఖాస్తు గ‌డువును ఈ నెల 14 వ‌ర‌కు పొడ‌గించింది. ద‌ర‌ఖాస్తు చేయ‌డంలో ఎదురువుతున్న ఇబ్బందుల‌పై ఫిర్యాదుల నేప‌థ్యంలో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు సూచ‌న‌ల‌తో గ‌డువు పొడిగిస్తూ నియామ‌క ప్ర‌క్రియ క‌మిటీ క‌న్వీన‌ర్ నీతూ ప్ర‌సాద్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.