సచిన్’తో టాలీవుడ్ హీరోయిన్ రొమాన్స్.. !

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తో ఓ టాలీవుడ్ హీరోయిన్ రొమాన్స్ చేసిందన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఆరోపణ చేసింది మరెవరో కాదు.. వివాదాస్పద నటి శ్రీరెడ్డి. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో టాలీవుడ్, కోలీవుడ్ ని షేక్ చేసిన.. ఈ బ్యూటీ ఇప్పుడు ట్రాక్ మార్చింది. ఏకంగా సచిన్ టెండూల్కర్ తో ఓ తెలుగు హీరోయిన్ కి లింకు పెడుతూ కామెంట్ చేసింది.

ఈ మేరకు తన ఫేస్ బుక్ పేజీలో ఓ పోస్ట్ పెట్టింది. “సచిన్ టెండూల్కరన్ అనే రొమాంటిక్ వ్యక్తి. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు, ‘ఛార్మిం’గ్ గర్ల్ ఆయనతో రొమాన్స్ చేసింది. పెద్ద మనిషిగా పేరుకున్న చాముండేశ్వర స్వామి ఈ రొమాన్స్ కు మధ్యవర్తి. గొప్ప వ్యక్తులు బాగా ఆడతారు. నా ఉద్దేశం బాగా రొమాన్స్ చేస్తారని” రాసుకొచ్చింది. ఇప్పుడీ పోస్టు దుమారం రేపుతోంది.

గతంలో సినీ ప్రముఖులపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలకు ఆమె సరైన ఆధారాలు చూపలేకపోయింది. ఏదో ఆరోపణలు చేసి.. హైలైట్ కావాలన్న తపనే ఆమెలో ఎక్కువగా కనిపించింది. ఇందులో భాగంగానే ఆమె సచిన్ ని పేరుని తెరపైకి తీసుకొచ్చి ఉంటుందని… క్రికెట్ అభిమానులు అంటున్నారు. మరీ.. శ్రీరెడ్డి ఆరోపణలపై సచిన్, ఛార్మింగ్ హీరోయిన్ స్పందిస్తారేమో చూడాలి.