గల్లీ గల్లీలో.. ‘దేవదాస్’ మారుమ్రోగాల్సిందే.. !


గణేషుడి పండగొచ్చేసింది. ఇక, గల్లీ గల్లీలో గణేషుడి పాటలు మారుమ్రోగాల్సిందే. ఐతే, ఈ సారి ‘దేవదాస్’లు నాగ్-నానిలు గణేషుడి కోసం కొత్త పాటని తీసుకొచ్చారు. వీరిద్దరు కలిసి నటిస్తున్న చిత్రం ‘దేవదాస్’. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. తాజాగా, ఈ చిత్రం నుంచి కొత్త సాంగ్ విడుదలైంది. అది కూడా గణేషుడి పాట కావడం విశేషం. ‘లక లక లకుమీకరా.. లంబోదరా…. ” అంటూ సాగే సాంగ్ అదిరిపోయింది. ఈ వినాయకుడి నవరాత్రోత్సవాలు దేవదాస్ పాట గల్లీ గల్లీలో మారుమ్రోగిపోవడం ఖాయం.

ఈ సాంగ్ ని నాని, నాగ్ లు తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇక, ‘పండగకి సాంగ్ కూడా సెట్.. స్టార్ట్ మ్యూజిక్’ నాని కామెంట్ పెట్టారు. ‘పందగ మొదలైపోయింది.. ‘ నాని దేవదాస్ సాంగ్ ని షేర్ చేశాడు. ఇక, ఈ చిత్రంలో నాగ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో, డాక్టర్ పాత్రలో నాని కనిపించబోతున్నారు. నాగ్ సరసన ఆకాంక్ష సింగ్, నాని సరసన రష్మిక మందన జతకట్టనున్నారు. తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచేపోయిన టైటిల్ ఇది. అందుకు తగ్గట్టుగానే సినిమా ఉండబోతుందని చెబుతున్నారు.