హలో గురూ.. పండగ పోస్టర్ !


త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రామ్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘హలో గురూ ప్రేమ కోసమే’. ‘ఉన్నది ఒక్కటే జీవితం’ తర్వాత రామ్ – అనుపమ కలిసి నటిస్తున్న చిత్రమిది. ఆ సినిమాలో ఈ జంట బాగుందని భావించి.. హలో గురూ.. కోసం మళ్లీ అనుపనే తీసుకొన్నారు. దసరా కానుకగా అక్టోబర్ 18న సినిమాని విడుదల చేయనున్నారు.

అభిమానులకి వినాయక చవితి బహుమతి అందజేశారు రామ్. హలో గురూ.. నుంచి కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. వర్షంలో గొడుగు తీసేసి ఎంజాయ్ చేస్తున్న అనుపమని పోస్టర్ లో చూడొచ్చు. ఈ నెల 17న టీజర్ ని విడుదల చేయబోతున్నట్టు పోస్టర్ లో తెలిపారు. త్రినాథ రావు సినిమాలు మాస్, యూత్ ని ఆకట్టుకొనేలా ఉంటాయి. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కూడా అదే జోనర్ లో తెరకెక్కినట్టు చెబుతున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. దిల్ రాజు నిర్మాత.