‘2.ఓ’ టీజర్ వచ్చేసింది

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోబో ‘2.O’ టీజర్ వచ్చేసింది. వినాయక చవితి కానుకగా ‘2.O’ టీజర్ ని కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. టీజర్ అదిరిపోయింది. ముందు నుంచి చెబుతున్నట్టు రోబో అంతకుమించి ‘2.O’ ఉండబోతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. సీక్వెల్ లో సెల్ ఫోన్స్ తో రోబో చేసిన హంగామా టీజర్ లో చూడొచ్చు.

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘2.O’లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ విలన్ గా కనిపించబోతున్నారు. ఎమీ జాక్సన్ హీరోయిన్. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాని నవంబర్ 29న రిలీజ్‌ చేయబోతున్నారు.