ఎన్టీఆర్’తో రానా చూశారా ?

‘రానా’ కాస్త ‘నారా’గా మారిపోయాడు. ‘ఎన్టీఆర్’ జీవితకథలో రానా చంద్రబాబు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వినాయక చవితి కానుకగా బుధవారం ఎన్టీఆర్ చిత్రంలో రానా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం. రానా అచ్చం చంద్రబాబు లాగే ఉన్నాడు. 1984లో చంద్రబాబు లుక్ అది. తాజాగా, ఎన్టీఆర్’తో కలిసి ఉన్న చంద్రబాబు అదే రానా పిక్ ని విడుదల చేశారు. ఈ పిక్ లో బాలయ్య, రానాలు అస్సలు కనిపించడం లేదు. నిజంగా ఎన్ టీఆర్, చంద్రబాబు ఉన్నట్టుగా ఉంది. అంతలా దర్శకుడు క్రిష్ పాత్రలని తీర్చిదిద్దారు. ఈ పిక్ పై మీరు ఓ లుక్కేయండీ.. !