రివ్యూ : శైలజారెడ్డి అల్లుడు

చిత్రం : శైల‌జారెడ్డి అల్లుడు (2018)

న‌టీనటులు : నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్, రమ్యకృష్ణ

సంగీతం : గోపీసుంద‌ర్‌

ద‌ర్శ‌క‌త్వం : మారుతి

నిర్మాత‌లు: నాగ‌వంశీ.ఎస్‌, పీడీవీ ప్ర‌సాద్‌

రేటింగ్ : 3/5

నాగచైతన్య మంచి ప్రేమికుడు అనిపించుకొన్నాడు. ప్రేమకథలతో విజయాలు అందుకొన్నాడు. మాస్ ఇమేజ్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. ఐతే, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాతో ఫ్యామిలీ ప్రేక్షకులకి దగ్గరయ్యాడు చైతూ. ఆయన నటించిన మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘శైలజారెడ్డి అల్లుడు’. శైలజారెడ్డి పాత్రలో రమ్యకృష్ణ నటించడంతో సినిమాపై అంచానాలు పెరిగాయి. డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు తీసి విజయాలు అందుకొంటున్న మారుతి ఈ సినిమా కోసం ఇగో కాన్సెప్ట్ ని ఎంచుకొన్నారు. ఇగో పాత్రలతో వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య వినాయక చవితి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. అల్లుడు ఎలా ఉన్నాడు ? ఏ మేరకు ఆకట్టుకొన్నాడు తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

చైతన్య (నాగచైతన్య) తండ్రి (ముర‌ళీ శ‌ర్మ‌) ఇగో ఎక్కువ. తాను చెప్పిందే జ‌ర‌గాల‌నే త‌త్వం ఆయనది. అచ్చం అలాంటి మ‌న‌స్త‌త్వ‌మున్న అమ్మాయి అను (అనూ ఇమ్మానుయేల్‌) చైత‌న్య జీవితంలోకి వ‌స్తుంది. తండ్రి అహాన్ని భ‌రించ‌డ‌మే ఒకెత్తైతే, అను అహం మ‌రో ఎత్తు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ సానుకూలంగా ఆలోచించే చైత‌న్య ఎలాగోలా అనుని త‌న దారిలోకి తెచ్చుకుంటాడు.
ఇంతలో అను తల్లికి ఇగో ఎక్కువ.. ఐదేళ్లుగా తల్లి, కూతురు మధ్య మాటల్లేవని చైతూ తెలుసుకొంటాడు. ఇటు ప్రేమించిన అను, అటు అత్త‌… ఈ ఇద్ద‌రి మ‌ధ్య అల్లుడు ఎలా న‌లిగిపోయాడు ? వీళ్లంద‌రి అహాన్ని ఎలా పోగొట్టాడు ? అనేది వినోదంతో కూడిన కథ.

ఎలా ఉందంటే ?

డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు చేయడం మారుతి ప్రత్యేక. ‘భలే భలే మగాడివోయ్’ మతి మరుపు కాన్సెప్టు, మహానుభావుడు కోసం అతిశుభ్రత కాన్సెప్టులని వాడారు మారుతి. ఆ కాన్సెప్టులతో కావాల్సినంత వినోదం పంచాడు. ఇప్పుడు ‘శైలజారెడ్డి అల్లుడు’ కోసం ‘ఇగో’ కాన్సెప్ట్ ని తీసుకొన్నాడు. అలాగని అత్త-అల్లుడు సవాల్-ప్రతి సవాళ్లకు వెళ్లలేదు. ఇగో గల పాత్రలతో వినోదాన్ని పంచాడు.

తండ్రి మురళీ శర్మ ఇగో పాత్రని పరిచయం చేస్తూ సినిమాని మొదలెట్టిన మారుతి.. అచ్చం అలాంటి లక్షణాలు గల అనుని చైతూ తొలి చూపులోనే ఇష్టపడం చూపించి కథపై ఆసక్తి పెంచాడు. అను తనని ప్రేమించేలా చేసుకోవడం, రొమాంటి సీన్స్ ఫస్టాఫ్ సరదా సరదా సాగిపోయింది. అత్త శైలజారెడ్డి పాత్ర ఎంట్రీతో ఇంటర్ వెల్ కార్డ్ వేశాడు. ఇక, అత్తొచ్చింది సెకాంఢాప్ అదిరిపోద్ది అనే ఫీలింగ్ కలిగించాడు.

ఇక, సెకాంఢాఫ్ లో చైతూ శైలాజారెడ్డి ఇంటికి వెళ్లడం, తల్లి, కూతుళ్ల ఫ్లాష్ బ్యాక్ ఏపీసోడ్ కావాల్సినంత వినోదాన్ని పంచాయి. క్లైమాక్స్ లో ఓ యాక్షన్ సీన్, కొన్ని ఎమోషనల్ సీన్స్ తో అను, అత్త శైలాజా రెడ్డిల ఇగోని దూరం చేస్తూ కథని సుఖాంతం చేశాడు. ఐతే, ఎక్కడా కామెడీ మిస్ కాకుండా జాగ్రత్త పడ్డాడు మారుతి.

ఎవరెలా చేశారంటే ?

వినోదం మారుతి బలం. ‘శైలజారెడ్డి అల్లుడు’లోనూ ఆ బలం బలంగా నిలిచింది. ఇక, తెరపై ప్రేమికుడిగా ఎక్కువగా కనిపించిన నాగ చైతన్య ఈ సారి కామెడీ బాగా చేశాడు. అన్నీ రకాల ఎమోషన్స్ తో ఆకట్టుకొన్నాడు. కుటుంబ కథా చిత్రాలకు తాను మంచి ఆప్షన్ అనిపించుకొన్నాడు. హీరోయిన్ అను ఇమ్మాన్యూయేల్ గ్లామర్, నటనతోనూ ఆకట్టుకొంది. శైలజారెడ్డి రమ్యకృష్ణ సినిమా స్థాయిని పెంచింది. ఇగో పాత్రలు మురళీ శర్మ, అను, రమ్యకృష్ణ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.

వెన్నెల కిషోర్, పృధ్వీ నవ్వులు పూయించారు. ఫస్టాఫ్ లో వెన్నెల కిషోర్, సెకాంఢాప్ లో పృధ్వీ ఎంటర్ టైన్ చేశారు. నరేష్, మురళీ శర్మల నటన బాగుంది. మిగితానటీనటులు ఫర్వాలేదనిపించారు. ఐతే, సినిమా ప్రారంభంలో, క్లైమాక్స్ లో సినిమా కాస్త స్లోగా సాగింది.

సాంకేతికంగా :

గోపీసుందర్ అందించిన పాటలు, నేపథ్యం సంగీతం బాగుంది. నిజర్ షఫీ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో ఇంకొన్ని సన్నివేశాలకు కత్తెర పెట్టొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : అల్లుడు.. అదరగొట్టేశాడు

రేటింగ్ : 3/5