‘యుటర్న్ (4/5)’ బ్లాక్ బస్టర్ హిట్


సమంత ఇష్టపడి మరీ చేసిన చిత్రం ‘యుటర్న్’. ఈ సినిమాపై సామ్ అంతలా ఇష్టం పెంచుకోవడానికి కారణాలేంటీ.. ? అనేది ఇన్నాళ్లు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడీ ప్రశ్నలకు సమాధానం దొరికేసింది. వినాయక చవితి కానుకగా ‘యుటర్న్’ నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకులు అదిరిపోయింది అంటున్నారు.

ఓ చిన్న పాయింట్’తో కథని మొదలెట్టిన దర్శకుడు పవన్ కుమార్. ట్విస్టులు, సస్పెన్స్ తో ప్రేక్షకులని సీట్లకు అత్తుకుపోయేలా చేశారు. క్లైమాక్స్’లో కర్మ భావనను అనుసంధానించడం మరియు వ్యక్తిగత జీవితాలను ఎలా ప్రభావితం చేయడం అనే విషయంతో సినిమాని ఆసక్తిగా ముగించాడు. ఫస్ట్ షోతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని ప్రేక్షకులు తేల్చేశారు. హిట్ టాక్ సొంతం చేసుకొన్న యుటర్న్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తోంది. మీ టీఎస్ మిర్చి.