24గంటలు 32మిలియన్లు

తెరపై చిట్టి హవా మళ్లీ మొదలైంది. శంకర్‌ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం ‘2.ఓ’. అమీ జాక్సన్‌ హీరోయిన్. అక్షయ్‌కుమార్‌ విలన్ గా నటించారు. వినాయకచవితి కానుకగా ఈ చిత్ర టీజర్‌ను గురువారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ విశేషమైన స్పందన వస్తోంది. 24గంటల్లో 32మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకొంది.

తమిళ, తెలుగు, హిందీ భాషల్లో టీజర్ విడుదలైంది. ఇందులో తమిళ టీజర్‌ వ్యూస్‌ 5.9మిలియన్‌, తెలుగు టీజర్ వ్యూస్ 3.7మిలియన్‌, హిందీ టీజర్ వ్యూస్ 5.1 మిలియన్లుగా ఉన్నాయి. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో వీఎఫ్‌ఎక్స్‌ పనుల కోసమే ఏకంగా రూ. 543కోట్లు ఖర్చు చేశారు. ఈ చిత్రాన్ని 3డీ కెమెరాలతోనే చిత్రీకరించడం గమనార్హం. ఈ చిత్రాన్ని ఈ యేడాది నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.