మహేష్’కు నటన రాదు.. !

ఈ మాట సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎవరైనా వింటే కొట్టేస్తారు జాగ్రత్త. ఐతే, ఓ తమిళ నటుడు మహేష్ పై ఈ రకమైన షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. మనోజ్‌ ప్రభాకర్‌.. కోలీవుడ్’లో కమెడియన్‌ గుర్తింపు తెచ్చుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇతడు మహేష్ పై నోరు పారేసుకొన్నాడు. అసలు మహేష్’కు నటనరాదని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

‘స్పైడర్’ సినిమాతో మహేష్ కోలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్, విలన్ గా నటించిన ఎస్ జె సూర్య నటనలని పోలుస్తూ.. సటైర్లు వేశాడు. ‘మహేష్ అసలు నటనే రాదు. ఆయనది రాక్‌ ఫేస్‌. స్పైడర్‌ సినిమాలో ఎస్‌జే సూర్య అద్భుతంగా నటిస్తుంటే హీరో మహేష్ మాత్రం ఎక్స్‌ప్రెషన్‌ లేకుండా అలా చూస్తుండిపోయాడు’ అంటూ కామెంట్ చేశాడు.

మహేష్’కు మాత్రమే కాదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కు నటనరాదు అంటూ కామెంట్స్ చేశాడు. ఐతే, ప్రిన్స్ ఫ్యాన్స్ ఊరుకొంటారా.. ? మనోజ్ ని ఓ రౌండ్ వేసుకొన్నారు. అతడిపై సోషల్ మీడియా వేదికగా యుద్ధం ప్రకటించారు. జ్ఝానోదయం అయిన మనోజ్ సంజాయిషీ ఇచ్చుకొనే ప్రయత్నం చేశాడు. అప్పటికే జరిగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఫిన్స్ ఫ్యాన్స్ నా మజాకా.. !