అల్లుడు.. ఫస్ట్ డే లెక్కంత ?


‘శైలజారెడ్డి అల్లుడు’గా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చాడు నాగ చైతన్య. ఫస్ట్ షోతోనే అల్లుడుపై పాజిటివ్ టాక్ వచ్చేసింది. దీనికితోడు పండగరోజు కావడం అల్లుడు ఫస్ట్ డే కలెక్షన్స్ అదిరిపోయాయ్. తొలిరోజే దాదాపు రూ. 12 కోట్ల గ్రాస్ ని రాబట్టాడు. ఈ యేడాది తొలిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్-5 చిత్రాల్లో అల్లుడు చేరడం విశేషం.

తెలుగు రాష్ట్రాల్లో అల్లుడు తొలిరోజు రూ. 6.93కోట్లు రాబట్టాడు. నిజాంలో రూ. 2.50 కోట్లు, తూ. గో రూ. 0.72కోట్లు, ప. గో రూ. 0.42, కృష్ణా రూ. 0.40కోట్లు, నెల్లూరు రూ. 0.23 కోట్లు, గుంటూరు రూ. రూ. 0.80 కోట్ల కలెక్షన్స్ సాధించాడు.

దర్శకుడు మారుతి ఎంచుకొన్న ఇగో కాన్సెప్ట్ మంచి వినోదాన్ని పంచుతోంది. ఇగో కలిగిన పాత్రలు సినిమాకు బలంగా మారాయి. ఇక, చైతూ అన్ని రకాల ఎమోషన్స్ తో ఆకట్టుకొన్నాడు. పండగ పూట ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ శని, ఆదివారాల్లో మంచి కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది. మరోవైపు, సమంత ‘యు టర్న్’ హిట్ టాక్ తెచ్చుకొంది.